For Money

Business News

ఈల్డ్స్‌ డౌన్‌… వాల్‌స్ట్రీట్‌ అప్‌

డాలర్‌ ఇండెక్స్‌లో పెద్ద మార్పు లేకున్నా అమెరికా ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్‌ భారీగా తగ్గాయి. పదేళ్ళ బాండ్స్‌పై ఈల్డ్స్‌ 4 శాతంపైగా తగ్గాయి. వాల్‌స్ట్రీట్‌లో అన్నింటికన్నా అధికంగా డౌజోన్స్‌ 2 శాతంపైగా పెరిగింది. దీనికి ప్రధాన కారణంగా క్రూడ్‌ ఆయిల్ ధరలు పెరిగిన దరిమిలా…అనేక ఎనర్జి షేర్లు భారీగా పెరగడమే. ఎస్‌ అండ్ పీ 500 సూచీ కూడా 1.9 శాతం పెరిగింది. అయితే నాస్‌డాక్‌ మాత్రం 1.43 శాతమే పెరిగింది. దీనికి ప్రధాన కారణం టెస్లా షేర్‌ 8శాతంపైగా క్షీణించడమే. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెస్లా కార్ల అమ్మకాలు ఆల్‌టైమ్‌ హైలో ఉన్నా… అంచనాల మేరకు ఉండకపోవచ్చని వార్తలు రావడంతో ఆ షేర్‌లో ఒత్తిడి పెరిగింది. ఈవారం సమావేశం కానున్న ఒపెక్‌ దేశాలు.. క్రూడ్‌ ఆయిల్‌ సరఫరా తగ్గించడం ద్వారా చమురు ధరలు తగ్గకుండా చూడాలని నిర్ణయించే అవకాశముంది. దీంతో క్రూడ్‌ ఆయిల్‌ ఇవాళ నాలుగు శాతంపైగా పెరిగింది. ఇక బులియన్‌ మార్కెట్‌లో కూడా జోష్‌ నెలకింది. వెండి ఏడు శాతం పెరగ్గా, బంగారం ఒకట్నిర శాతం పెరిగింది.