For Money

Business News

ఒకే రోజు రూ. 3,411 పెరిగిన వెండి

అమెరికా ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ బలహీనపడటంతో పాటు ఇవాళ అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ భారీ క్షీణించడంతో ఈక్విటీ మార్కెట్లలో జోష్‌ వచ్చింది. అయితే పారిశ్రామికవృద్ధికి సంబంధించిన డేటా అంచనాలకు మించడంతో ఒక్కసారిగా వెండికి డిమాండ్‌ వచ్చింది. అమెరికా మార్కెట్లలో వెండి ధర 7.6 శాతం పెరిగి 20.50 డాలర్లకు చేరింది. దీంతో మన మార్కెట్‌లో ఎన్‌సీఎక్స్‌లో కిలోవెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 3,411 పెరిగి రూ. 60269ని తాకింది. వెండి కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో 1.5 శాతం పెరిగి 1696 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ఎంసీఎక్స్‌లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ఇవాళ రూ.758 పెరిగి రూ.50,950కి చేరింది. క్రూడ్‌ ఆయిల్‌ కూడా పెరిగింది. క్రూడ్‌ ఆయిల్ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 4 శాతం దాకా పెరిగి రూ.248 లాభంతో రూ.6887 వద్ద ట్రేడవుతోంది.