For Money

Business News

భారీ లాభాల్లో మార్కెట్లు

ఈక్విటీ మార్కెట్లు ఇవాళ ఆకర్షణీయ లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరో మార్కెట్లు దాదాపు ఒక శాతం లాభంతో క్లోజ్‌ కాగా, అమెరికా మార్కెట్లు 1.5 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అమెరికాలో ఇవాళ మధ్యంతర ఎన్నికల ఓటింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ 0.8 శాతం క్షీణించింది. డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 110 లోపునకు వచ్చేసింది. బాండ్‌ ఈల్డ్స్‌ కూడా తగ్గాయి. డౌజోన్స్‌ ఒకటిన్నర శాతం లాభపడగా, నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 1.3 శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ భారీగా క్షీణించడంతో పాటు క్రూడ్‌ కూడా తగ్గడం విశేషం. బ్రెంట్‌ క్రూడ్‌ 97 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి 67 పాయింట్ల లాభంతో ఉంది.