For Money

Business News

ఆ కోటీశ్వరులకు ప్రధాని PayPM

ప్రధాని మోడీ ప్రకటించిన నోట్ల రద్దుకు ఆరేళ్ళ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన స్పందిస్తూ ఇద్దరు ముగ్గురు కోటీశ్వరులకు ప్రధాని పేపీఎం (PayPM)గా వ్యవహరించారని ట్వీట్‌ చేశారు. వారి కోసమే నోట్లను రద్దు చేశారని అన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలను నాశనం చేసి… ఈ దేశ ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం సాధించేలా వారిని పేపీఎంగా ప్రధాని మోడీ మారారని రాహుల్‌ అన్నారు. ఈ ట్వీట్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. నోట్ల రద్దు ఓ విఫల ప్రయోగమని చెప్పే పలు కథనాలు, అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలు ఆ వీడియోలో ఉన్నాయి. 2016 నవంబరు 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. చెలామణిలో ఉన్న నల్లధనం దీనివల్ల ఆగిపోతుందని నాడు ప్రధాని అన్నారు. అపుడు చెలామణిలో రూ.17 లక్షల కోట్లు ఉండగా కనీసం పది శాతంపైగా నల్లధనం సరఫరా నుంచి మాయమైపోతుందని నమ్మబలికారు. కాని అలా జరగలేదు. ఈ ఏడాది అక్టోబరు 21 నాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు 30.88లక్షల కోట్లకు చేరింది.