For Money

Business News

నాస్‌డాక్‌కు యాపిల్‌తో లైఫ్‌

వరుసగా బ్లూచిప్‌ కంపెనీల నిరాశాజనక పనితీరుతో కుదేలైన నాస్‌డాక్‌కు యాపిల్ కంపెనీ ఇవాళ అండగా నిలిచింది. కంపెనీ ఫలితాలు బాగుండటంతో ఆ షేర్‌ ఆరు శాతంపైగా లాభపడింది. పైగా నిన్న, మొన్న భారీగా క్షీణించిన మెటా, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌ షేర్లు ఇవాళ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మెటా ప్లాట్‌ఫామ్స్‌ 10.7 శాతం వరకు పడనమైన విషయం తెలిసిందే. డాలర్‌ స్వల్పంగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 111ని దాటే అవకాశముంది. అలాగే బాండ్‌ ఈల్డ్స్‌ కూడా పెరిగాయి. పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ నాలుగు శాతం దాటాయి. చిత్రంగా నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500, డౌజోన్స్ సూచీలన్నీ 1.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం, డాలర్‌ స్వల్పంగా పెరగడంతో క్రూడ్‌ ధరలు దాదాపు రెండు శాతం తగ్గాయి. బంగారం, వెండి కూడా ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి.