For Money

Business News

రాణించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ.1,112.80 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన రూ.992 కోట్ల నికరలాభంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం కూడా రూ.5,215.40 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.6,305.70 కోట్లకు చేరింది. కంపెనీ నికర లాభం మార్కెట్‌ అంచనాలను మించిదని చెప్పొచ్చు. కంపెనీ ఆదాయంలో
అంతర్జాతీయ మార్కెట్‌లో జనరిక్‌ ఔషధాలను అమ్మకాల ద్వారా రూ. 5995 కోట్లు సమకూరినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో అమెరికా టర్నోవర్‌ మొత్తంఅమ్మకాల్లో 48 శాతానికి పెరిగింది. యూరప్‌ నుంచి రూ.413 కోట్లు, భారత్‌ నుంచి రూ.1,140 కోట్లు, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి రూ.1,298 కోట్లు లభించాయి. గత త్రైమాసికంలో ఆర్‌అండ్‌డీ కోసం సంస్థ రూ.490 కోట్ల నిధులు వెచ్చించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం రూ.580 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు పేర్కొంది
పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నామని కంపెనీ కో-చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు.