For Money

Business News

మిశ్రమంగా అమెరికా మార్కెట్లు

వాల్‌స్ట్రీట్‌లో పెద్దగా హల్‌చల్‌ లేదు. అంతా స్తబ్దుగా ఉంది. పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ మళ్ళీ 3 శాతం దాటాయి.క్రూడ్‌ ఆయిల్‌ 122 డాలర్లను దాటింది. డాలర్‌ కూడా స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌లోని మూడు ప్రధాన సూచీలు లాభనష్టాల్లో ఉన్నా పెద్ద మార్పు లేదు. డౌజోన్స్‌ కాస్త అధికంగా 0.35 శాతం నష్టంతో ఉంది. ఎస్‌ అండ్ పీ 500 సూచీ 0.28 శాతం నష్టంతో ఉంది. నాస్‌డాక్‌ మాత్రం ఇవాళ గ్రీన్‌లో ఉంది. లాభం మాత్రం పరిమితమే. టెస్లా ఇవాళ నాలుగు శాతం లాభంతో ఉంది. అమెరికా వారాంతపు క్రూడ్‌ నిల్వలకు సంబంధించిన డేటా కూడా పాజిటివ్‌గా ఉండటతో క్రూడ్‌ ధరలు ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. మరోవైపు బులియన్‌ మార్కెట్‌లో కూడా చెప్పుకోదగ్గ మార్పులేదు. బంగారం 1850 డాలర్లపైన ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే వెండి కూడా 22 డాలర్లపైన ఉంటోంది.