For Money

Business News

రిలయన్స్‌ నుంచి కూల్‌ డ్రింక్స్

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశీ కూల్‌ డ్రింక్స్‌ను తయారు చేస్తోంది. Yeah! పేరుతో వీటిని మార్కెట్‌ చేస్తోంది. కోలా, జీరా మసాలా, లెమన్‌, క్లియర్‌ లెమన్‌, ప్లయిన్‌ సోడా, ఆరంజ్‌ జ్యూస్‌ వంటి ఆరు రకాల డ్రింక్స్‌ను అమ్ముతోంది. ప్రారంభం ఆఫర్‌ కింద బై వన్ గెట్‌ వన్‌ ఫ్రీ ఆఫర్‌ ఇస్తోంది. ప్లయిన్‌ సోడా లీటర్‌ బాలిట్‌ రూ. 22కు అమ్ముతోంది. కోలా రెండు లీటర్ల బాటిల్‌ను రూ.49కు ఆఫర్‌ చేస్తోంది. టేస్ట్‌ విషయానికొస్తే… గొప్పగా లేకున్నా… మరీ చెత్తగా లేదని కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడుతున్నారు. థమ్స్‌ అప్‌లోఎక్కువ నీళ్ళు పోసినట్లుందని అంటున్నారు. థమ్సప్‌తో పోలిస్తే… కస్టమర్లు దీన్ని ఇష్టపడకపోవచ్చని కూడా రాస్తున్నారు. మరి క్వాలిటీ పెరుగుతుందేమో చూద్దాం.