For Money

Business News

10 శాతం వృద్ధి సాధిస్తాం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడ్డు పరిస్థితులు ఉన్నా.. నికర లాభంలో పది శాతం లాభం ఆర్జిస్తామన్న ఆశాభావాన్ని ఎన్‌సీసీ వ్యక్తం చేసింది. ఆదాయంలో కూడా కనీసం 10 నుంచి 15 శాతం వృద్ధి సాధిస్తామని అంటోంది. ఇటీవల ఇన్వెస్టర్లతో నిర్వహించిన ‘కాన్ఫెరెన్స్ కాల్‌’లో కంపెనీ యాజమాన్యం ఈ వివరాలు వెల్లడించింది. సిమెంటు , స్టీలు ధరలు గణనీయంగా పెరగడం వల్ల ప్రాజెక్టు వ్యయాలు పెరుగుతున్నాయని, మరోవైపు పూర్తి చేసిన ప్రాజెక్టుల బిల్లులు వెంటనే వసూలు కావడం లేదని యాజమాన్యం పేర్కొంది. ఎన్‌హెచ్‌ఏఐతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇటీవల కాలంలో చెల్లింపులు పెరిగినట్లు తెలిపాయి. మరోవైపు తాము ఎన్సీసీ లిమిటెడ్ రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్లే మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. గత ఏడాది డిసెంబరు నాటికి కంపెనీకి రూ .2040 కోట్ల రుణభారం ఉండగా, ఈ ఏడాది మార్చికల్లా రుణభారాన్ని రూ .1200 కోట్లకు తగ్గించుకోగలిగినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని మరింత తగ్గేంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ .9,900 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు కంపెనీకి లభించాయి. దీంతో అనుబంధ కంపెనీలతో కలిసి ఎన్‌సీసీ వద్ద రూ .39,400 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి.