For Money

Business News

TECH VIEW: 16,200 వద్ద పుట్‌ రైటింగ్‌

నిన్న మార్కెట్‌ 16,400 స్థాయిని పోగొట్టుకుంది. పరపతి విధానం ప్రకటించే సమయంలో ఆర్బీఐ గవర్నర్‌ ప్రసంగం ఆశాజనకంగా ఉన్నా… ఏడాది చివరి దాకా ద్రవ్యోల్బణం ఆరు శాతంపైగా ఉంటుందని పేర్కొనడం మార్కెట్‌కు నెగిటివ్‌గా మారింది. అలాగే కరోనా సమయంలో ప్రకటించిన ఉద్దీపనలు క్రమంగా కనుమరుగు అవుతాయని అన్నారు. వడ్డీ రేట్లు పెంచడం వల్ల రుణాలు పెరిగుతాయని, వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉంటుందనే ఆశాభావంతో ఆర్బీఐ గవర్నర్‌ ఉన్నారు. అయితే మార్కెట్‌లో మాత్రం నెగిటివ్ సిగ్నల్స్‌ వచ్చేశాయి. ఒకదశలో భారీగా నష్టపోయినా.. నిఫ్టి నిన్న కోలుకుంది. 16,350 ప్రాంతంలో ముగిసింది. దినసరి చార్ట్‌లను చూస్తే నెగిటివ్‌ క్యాండిల్‌ ఏర్పడింది. ఇక ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో చూస్తే కాల్ రైటింగ్‌ 17200 నుంచి 16800కి మారింది.16800 వద్ద ఓపెన్‌ ఇంటరెస్ట్‌ అధికంగా ఉంది. 17200 ఓపెన్‌ ఇంటరెస్ట్‌ బాగా తగ్గింది. అంటే నిఫ్టి 16,800 స్థాయి దాటడం కష్టమని చెప్పొచ్చు. ఇక 16,600 వద్ద కూడా ఓపెన్‌ ఇంటరెస్ట్‌ పెరుగుతోంది. ఇక పుట్‌ సైడ్‌ చూస్తే… అత్యధికంగా ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 16,000 వద్ద ఉంది. ఆ తరవాత అధిక పుట్ రైటింగ్‌ 16200 వద్ద ఉంది. 16300 స్థాయిపై ఆశలు వొదులుకున్నట్లే. మరి 16200 స్థాయి ఇవాళ నిలబడుతుందేమో చూడాలి.