For Money

Business News

SGX నిఫ్టి 64 పాయింట్లు డౌన్‌

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. టెక్‌తో పాటు ఐటీ కౌంటర్లలో వచ్చిన ఒత్తిడి కారణంగా ఎస్‌ అండ్ పీ 500 సూచీ ఒక శాతంపైగా నష్టపోయింది. నాస్‌డాక్‌ నష్టాలు 0.7 శాతానికి పరిమితమయ్యాయి. డౌ జోన్స్‌ 0.81 శాతం నష్టపోవడం విశేషం. ఆరంభంలో వాల్‌స్ట్రీట్‌లో పెద్ద ఒత్తిడి లేదు. కాని బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, డాలర్‌ స్థిరంగా ఉండటంతో పాటు క్రూడ్‌ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో అమ్మకాల ఒత్తిడి అధికమైంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్‌ భిన్నంగా, మిశ్రమంగా ఉన్నాయి. చైనా A20 సూచీ 1.2 శాతంపైగా లాభంతో ఉంది. షాంఘై సూచీ మాత్రం 0.15 శాతం నష్టంతో ఉంది. ఇక హాంగ్‌సెంగ్‌ స్థిరంగా ఉంది. రెడ్‌లో ఉన్న నామమాత్రమే. ఇక జపాన్‌ నిక్కీ కూడా స్థిరంగా క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 65 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. నిఫ్టి నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉంది. మార్కెట్‌ ప్రారంభమయ్యే సరికి నిఫ్టి మరింత కోలుకునే అవకాశముంది.