For Money

Business News

రష్యా క్రూడ్‌ పై అమెరికా నిషేధం

అమెరికన్‌ మీడియా వార్తలు నిజమయ్యాయి. రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌, గ్యాస్‌తోపాటు ఇతర ఇంధనాల దిగుమతిని నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఇవాళ ఆయన ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఖండిస్తూ… ప్రజల స్వేచ్ఛను కాపాడేందుకు అమెరికా ఎంత దూరమైనా వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. సగటున నెలకు రష్యా నుంచి 2.04 కోట్ల బ్యారెళ్ళ క్రూడ్‌ను ఇతర రిఫైండ్‌ ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంటుంది. ఈ నిషేధం తరవాత అమెరికా రేవుల్లో ఎక్కడా రష్యా ఆయిల్‌ దిగుమతికి అంగీకరించరు. మరోవైపు షెల్‌ కంపెనీ కూడా రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌, గ్యాస్‌ దిగుమతులను ఆపేసింది.