For Money

Business News

అమ్మకానికి యూపీఎల్?

ప్రముఖ రసాయనాల కంపెనీ యూపీఎల్‌ (గతంలో యునైటెడ్‌ ఫాస్ఫరస్‌ లిమిటెడ్‌) ను ప్రమోటర్లు అమ్మకానికి పెట్టారని కొద్దిసేపటి క్రితం మనీ కంట్రోల్‌ డాట్‌ కామ్‌ వెల్లడించింది. కంపెనీ ప్రమోటర్లు విడిపోవాలని నిర్ణయించుకున్నారని, వారికి నిధుల అవసరం కూడా ఉందని… వీటి పరిష్కారం మార్గంగా యూపీఎల్‌లో ఉన్న తమ వాటా విక్రయించాలని నిర్ణయించినట్లు ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ విషయమై స్పందించేందుకు కంపెనీ అంగీకరించలేదని మనీ కంట్రోల్‌ డాట్‌ కామ్‌ పేర్కొంది. అమ్మకం ప్రక్రియ చూసేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను కూడా నియమించినట్లు తెలిపింది. ఇటీవల రూ. 1000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది కంపెనీ. ఈ బైబ్యాక్‌ ఆఫర్‌ కంపెనీ వ్యాల్యూయేషన్‌కు ఒక ప్రాతిపదిక అవుతుందని కంపెనీ ప్రమోటర్లు భావిస్తున్నారు. కంపెనీలో ప్రమోటర్లు రజనీకాంత్‌ ష్రాఫ్‌, జై ష్రాఫ్‌, విక్రమ్ ష్రాఫ్‌లకు 28.24 శాతం వాటా ఉంది.