For Money

Business News

రూపాయికే కిలో పప్పు

పేదలకు ఇక నుంచి నెలకు ఒక కిలో పప్పు ధాన్యాలను ఒక రూపాయికే అందించాలని ఝార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పేదలు, రైతులకు వంద యూనిట్ల వరకు కరెంటును కూడా ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించినట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రామేశ్వర్‌ ఒరాన్‌ తెలిపారు. 2022-23 సంవత్సరానికి ఆయన ఇవాళ లక్ష కోట్ల రూపాయాలతో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. ఇక నుంచి రేషన్‌ షాపుల్లో ప్రతినెలా కిలో పప్పు ధాన్యాలు ఒక రూపాయికే ఇస్తామన్నారు. అంగన్‌వాడీ సెంటర్లలో ఉండే పిల్లల కోసం 15 లక్షల దుస్తులు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. వంద గ్రామాల్లో ఆగ్రి స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకం ప్రారంభిస్తున్నామని అన్నారు. అలాగే ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు గురూజీ క్రెడిట్‌ కార్డ్‌ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నామని అన్నారు.