For Money

Business News

బిట్‌ కాయిన్‌ మళ్ళీ పతనం

గత వారం రోజుల్లో ఏకంగా 25 శాతం పెరిగిన బిట్‌కాయిన్‌లో ఇవాళ మళ్ళీ కరెక్షన్‌ కన్పిస్తోంది. ఇవాళ క్రిప్టో కరెన్సీలన్నీ డల్‌గా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై అమెరికా దాడి, రష్యాపై ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో మార్కెట్‌లో క్రిప్టో ఫీవర్‌ వచ్చింది. ఎవరూ చూసినా… ఇక క్రిప్టోకరెన్సీలదే భవిష్యత్తు అంటే తెగ కొన్నారు. కేవలం వారంలో బిట్‌కాయిన్‌ 25 శాతంపైగా పెరిగింది. ఇవాళ దాదాపు నాలుగు శాతం క్షీణించింది. దీంతో పాటు బాగా లాభాలు పొందిన ఎథీరియం కూడా ఇవాళ నాలుగు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. తెథర్‌ ఒక డాలర్‌, బినాన్స్‌ 400.60 డాలర్లు, యూఎస్‌డీ కాయిన్‌ 1 డాలర్‌. రిపల్‌ 0.08 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.