For Money

Business News

అమెరికాకు ధరల మంట

ద్రవ్యోల్బణంపై అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ చేస్తున్న యుద్ధం ఫలితాలు ఇవ్వడం లేదు. సెప్టెంబర్‌ నెలలో కూడా కన్సూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ – సీపీఐ (వినియోగదారుల ధరల సూచీ) పెరగడంతో అమెరికా కేంద్ర బ్యాంకు కంగు తింది. ఆగస్టుతో పోలిస్తే ఈసూచీ 0.2 శాతం చొప్పున పెరుగుతుందని భావించారు. అయితే 0.4 శాతం చొప్పున పెరిగింది. అదే వార్షిక ప్రాతిపదికన చూస్తే సెప్టెంబర్‌లో 8.2 శాతం చొప్పున పెరిగాయి. కన్సూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ లో వినియోగదారుల ఆహార వస్తువులు, సర్వీసుల ధరలు కలిసి ఉంటాయి. అదే కోర్‌ సీపీఐలో ఆహారవస్తువులు, ఇంధన ధరలను తొలగించి లెక్కిస్తారు. నిజానికి ఇవే అమెరికా ఆర్థిక వ్యవస్థ అసలు పరిస్థితిని చూపుతారు. ఈ సూచీ కూడా గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో 6.6 శాతం పెరిగింది. 1982 తరవాత అంటే 40 ఏళ్ళ తరవాత ఈ స్థాయిలో కోర్‌ సీపీఐ పెరిగింది. నిజానికి ద్రవ్యోల్బణం రెండు శాతానికి చేర్చాలని అమెరికా కేంద్ర భావిస్తోంది. కాని ఇపుడు 8.2 శాతానికి చేరింది. దీన్ని తగ్గించాలంటే వడ్డీ రేట్లను మరింత భారీగా పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.