For Money

Business News

రెండో అత్యంత ఖరీదైన నగరం హైదరాబాద్‌

గతంలో ఆఫర్డబుల్‌ హౌసింగ్‌ (అందుబాటు ధరలో  గృహాలు) అంటే హైదరాబాద్‌. ఈ కేటగిరిలో నగరం నంబర్‌ వన్‌గా ఉండేది. ఇపుడు పరిస్థితి మారింది. అత్యంత ఖరీదైన నివాస గృహాల మార్కెట్‌ బాంబే తరవాత హైదరాబాదే. రిలయ్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ఫ్రాంట్‌ రూపొందించిన ఆఫర్డబుల్‌ ఇండెక్స్‌లో వివిధ నగరాలకు సంబంధించిన వివరాలు ఇచ్చింది. నివాసగృహాలు అత్యంత ఖరీదుగా మారిన నగరాల్లో బాంబే నంబర్‌ వన్‌ కాగా, హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఢిల్లీ నిలబడింది. తరువాతి స్థానాలు వరుసగా బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కతా ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ నగరంలో రోజు రోజుకూ గృహాల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కూడా నైట్‌ఫ్రాంక్‌ పేర్కొంది. కొవిడ్‌ తరువాత స్థిరాస్తి వ్యాపారం బాగా పుంజుకుందని అంచనా వేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో రూ. 25,094 కోట్ల విలువైన 50,953 గృహ యూనిట్లు అమ్ముడుపోగా… గత ఏడాది ఇదే కాలంలో రూ.27,640 కోట్ల విలువైన 62,052 గృహ యూనిట్లు అమ్ముడు పోయాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.2,546 కోట్ల విలువైన 11,099 యూనిట్లు తగ్గాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో తమకు ఇష్టమైన ఇంటి కోసం వేచి ఉండకుండా … అందుబాటులో ఉన్న ఇంటిని కొనేందుకే యజమానులు ఇష్టపడుతున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది.