For Money

Business News

అంచనాలను మించిన ఫలితాలు

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ అంచనాలకు మించి పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 36,538 కోట్ల టర్నోవర్‌పై రూ. 9021 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది కంపెనీ రూ. 34,470 టర్నోవర్‌పై రూ. 5360 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఈ లెక్కన టర్నోవర్‌ 6 శాతం, నికర లాభం 12.3 శాతం చొప్పున వృద్ధి చెందింది. సీఎన్‌బీసీ టీవీ18 నిర్వహించిన పోల్‌లో పాల్గొన్న విశ్లేషకులు ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ రూ. 5638 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. కంపెనీ మార్జిన్‌ కూడా గత ఏడాదితో పోలిస్తే 1.4 శాతం పెరిగి రూ. 20.1 శాతం నుంచి 21.5 శాతాని చేరింది.
షేర్ల బైబ్యాక్‌
షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు కూడా ఇవాళ భేటీ అయిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఒక్కో షేర్‌ను రూ. 1850 చొప్పున రూ. 9300 కోట్ల విలువైన షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది.ఒక్కో షేర్‌కు రూ. 16.50 తాత్కాలిక డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. కంపెనీని వొదిలి వెళుతున్న ఉద్యోగుల శాతం 28.4 శాతం నుంచి 27.1 శాతానికి తగ్గినట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. అలాగే మున్ముందు కంపెనీ పనితీరు బాగుంటుందని పేర్కొంది.రెండో త్రైమాసికంలో పెద్ద డీల్స్‌ కుదుర్చుకున్నామని.. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరు కనబర్చామని కంపెనీ ఎండీ, సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. ఇంకా అనేక ప్రాజెక్టులు రానున్నాయని… సేవల డెలివరీ విషయంలో తమ కంపెనీపై కస్టమర్లకు ఎనలేని విశ్వాసం ఉందని సలీల్‌ పరేఖ్‌ అన్నారు.