For Money

Business News

ఏపీ, తెలంగాణకు షాక్‌

ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇండియన్‌ ఎలక్ట్రిసిటీ ఎక్స్ఛేంజ్‌ (IEX) ద్వారా విద్యుత్‌ కొనుగోలు చేయకుండా 13 రాష్ట్రాలకు చెందిన 27 రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలపై నిషేధం విధించారు. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఎక్స్ఛేంజీ ద్వారా ఈ రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ కంపెనీలు విద్యుత్‌ కొనుగోలు చేయలేవు. సాధారణంగా ఈ ఎక్స్ఛేంజీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం, అమ్మడం జరుగుతుటుంది. కాని వివిధ రాష్ట్రాలు దీని నుంచి విద్యుత్‌ను కొంటుంటాయి. రాష్ట్ర విద్యుత్‌ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.5 లక్షల కోట్లు దాటడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తాము సొంతంగా తయారు చేసిన విద్యుత్‌తో పాటు వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నవాటి నుంచి విద్యుత్‌ మాత్రం సరఫరా సాగుతోంది. అత్యవసరం సమయంలలో ఈ ఎక్స్ఛేంజీ నుంచి కొనుగోలు చేయాలంటే మాత్రం కుదరదు. కేంద్ర విద్యుత్‌ శాఖ పరిధిలోని పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (Posoco) ఈ నిర్ణయం తీసుకుంది. బకాయి ఉన్న రాష్ట్రాలో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాజస్థాన్‌ రాష్ట్రాలు కూడా బకాయి ఉన్నాయి.
బకాయిలు…
తెలంగాణ రూ. 1380 కోట్లు
తమిళనాడు రూ. 924 కోట్లు
రాజస్థాన్‌ రూ. 500 కోట్లు
జమ్మూ కాశ్మీర్‌ రూ. 434 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌ రూ. 412 కోట్లు
మహారాష్ట్ర రూ. 381 కోట్లు
చత్తీస్‌ఘడ్‌ రూ. 274కోట్లు
మధ్యప్రదేశ్‌ రూ. 230 కోట్లు
ఝార్ఖండ్‌ రూ. 214 కోట్లు
బీహార్‌ రూ.172 కోట్లు
సమస్య ఉండదు…
చాలా రాష్ట్రాలకు తమ అవసరాలకు సరపడా విద్యుత్ తమ సొంత ప్లాంట్ల నుంచి వస్తుంది. అలాగే ప్రైవేట్‌ కంపెనీల నుంచి కూడా సరఫరా అవుతుంది.కాబట్టి కేంద్రం చర్యల వల్ల పెద్ద నష్టం లేదు. సరిపడనంత విద్యుత్‌ సరఫరా లేని రాష్ట్రాలకే ఇబ్బంది ఉంటుంది. పైగా వర్షాకాలం కావడం వల్ల డిమాండ్‌ తక్కువగా ఉంటుంది. కాని సొంత ప్లాంట్లు సరిగ్గా నడుపుకోలేని రాష్ట్రాలు ఇబ్బంది పడుతాయి.