For Money

Business News

లాభాల్లో ముగిసిన నిఫ్టి

ఉదయం నష్టాల తరవాత ఒకసారి లాభాల్లోకి వచ్చిన నిఫ్టి… మిడ్‌ సెషన్‌లో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17852ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని… క్లోజింగ్‌ ముందు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17968ని తాకింది. చివరికి 17956 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 12 పాయింట్లు పెరిగింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో గ్రీన్‌లో ఉండటం, యూరో ఫ్యూచర్స్ నష్టాలు నామమాత్రంగా ఉండటంతో డెరివేటివ్స్‌ వీక్లీ క్లోజింగ్‌ పాజిటివ్‌గా ముగిసింది. అనేక షేర్లు ఇవాళ దిగువ స్థాయి నుంచి కోలుకున్నాయి. ముఖ్యంగా ఇవాళ నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి బ్యాంక్‌ షేర్లు బాగా కోలుకున్నాయి. నిఫ్టిలో కొటక్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌ కాగా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ టాప్‌ లూజర్‌గా ముగిసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన మెజారిటీ షేర్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ త్వరలోనే నిఫ్టిలోకి వస్తుందన్న వార్తలతో ఈ షేర్‌ ఇవాళ 5 శాతం పెరిగింది. అదానీ గ్రూప్‌ కంపెనీ అంబుజా సిమెంట్‌ కూడా మూడు శాతంపైగా లాభపడింది. ఎస్‌బీఐ కార్డ్స్‌ ఇవాళ నాలుగు శాతంపైగా క్షీణించడం విశేషం. ఇక నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో ఐఆర్‌సీటీసీ 8 శాతం దాకా పెరిగింది.