For Money

Business News

‘సులా వైన్‌యార్డ్స్‌’ ఐపీఓ 12న

మార్కెట్‌ ఆసక్తి రేపుతున్న సులా వైన్‌యార్డ్స్‌ కంపెనీ క్యాపిటల్‌ మార్కెట్‌లో ఈ నెల 12న ప్రవేశిస్తోంది. మార్కెట్‌ నుంచి రూ.960 కోట్లు సమీకరించేందుకు ఈ ఇష్యూ వస్తోంది. పబ్లిక్ ఆపర్‌ 14న ముగుస్తుంది. ఒక్కో షేర్‌ కనిష్ఠ ధర రూ. రూ.340 గరిష్ఠ ధర357గా నిర్ణయించారు. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ కింద పూర్తిగా ప్రమోటర్ల షేర్లను అమ్మకానికి పెడుతున్నారు. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు కలిపి మొత్తం 2.7 కోట్ల షేర్లను అమ్ముతారు. రీటైల్‌ ఇన్వెస్టర్లు కనిష్ఠంగా 42 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ ధరను పరిగణనలోకి తీసుకుంటే ఒక లాట్‌ కోసం ఇన్వెస్టర్లు రూ. 14,944 చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 11 లాట్లకు అంటే 544 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. షేర్ల అలాట్‌మెంట్‌ ఈనెల 19న ఉంటుంది. షేర్లు 22వ తేదీన లిస్ట్‌ అవుతాయి. తను తయారు చేసే వైన్‌తో పాటు అంతర్జాతీయ బ్రాండ్లను కూడా ఈకంపెనీ విక్రయిస్తోంది. మొత్తం 13 రకాల బ్రాండ్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో మొత్తం ఆరు తయారీ కేంద్రాలున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలోనే తయారు అవుతుంది. 2022 సెప్టెంబరు 30తో ముగిసిన ఆరు నెలల కాలంలో కంపెనీ రూ. 224 కోట్ల టర్నోవర్‌పై రూ. రూ.30.51 కోట్ల నికర లాభం ఆర్జించింది. గ్రేమార్కెట్‌లో అంటే అనధికార మార్కెట్‌లో ఈ షేర్‌కు ఇపుడు రూ. 47 ప్రీమియం నడుస్తోంది.