For Money

Business News

ఈ ఆరు షేర్ల జోలికి పోవద్దు

అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ డిసెంబర్‌ నెలకు గాను కొన్ని షేర్లను సిఫారసు చేసింది. వీటిలో 19 టాప్‌ బై కాల్స్‌ కాగా 6 సెల్‌ కాల్స్‌. కొనుగోలు చేయాల్సిందిగా సిఫారసు చేసిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ, టీవీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ, లోధా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, జొమాటొ, సన్‌ ఫార్మా, ఇండియన్‌ హోటల్స్‌ ఉన్నాయి. మరో ఆరు షేర్లను అమ్మాల్సిందిగా సిఫారసు చేసింది.
వీటిలో ఐటీ మిడ్‌ క్యాప్‌ షేర్‌ అయిన కోఫోర్జ్‌కు అండర్‌ పెర్ఫామ్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 4196 వద్ద ఉండగా, ఇక్కడి నుంచి 20 శాతం క్షీణించి రూ. 3340కి చేరుతుందని పేర్కొంది. కంపెనీ పనితీరు నిరుత్సాహకరంగా ఉంటుందని జెఫరీస్‌ అంటోంది.
అలాగే భారత్‌ ఫోర్జ్‌ కంపెనీ షేర్‌ను కూడా డౌన్‌గ్రేడ్‌ చేసింది జెఫరీస్‌. ఇపుడు ఈ షేర్‌ రూ. 850 వద్ద ఉంది. ఇక్కడి నుంచి 35 శాతం క్షీణించి రూ. 555కు చేరే అవకాశం ఉందని జెఫరీస్‌ పేర్కొంది. అమెరికా నుంచి ఆదాయం భారీ క్షీణిస్తుందని ఈ బ్రోకరేజీ సంస్థ అంచనా వేస్తోంది.
ఇపుడు రూ. 241 వద్ద ఉన్న మహీంద్రా ఫైనాన్స్‌ షేర్‌ కూడా రూ. 175కి అంటే 27 శాతం తగ్గే అవకాశం ఉందని జెఫరీస్‌ పేర్కొంది. కంపెనీ నికర లాభం తగ్గుతుందని ఈ బ్రోకరేజీ సంస్థ అంచనా వేస్తోంది.
చమురు ధరలు బాగా తగ్గుతున్నా… ఏషియన్‌ పెయింట్స్‌ షేర్‌కు నెగిటివ్‌ ఔట్‌లుక్‌ ఇచ్చింది జెఫరీస్‌. ఈ షేర్‌ ఇపుడు రూ. 3160 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడి నుంచి 20 శాతం క్షీణించి రూ. 2530కి పడుతుందని పేర్కొంది. ఈ కంపెనీ మార్జిన్స్‌ కూడా తగ్గుతాయని జెఫరీస్‌ అంటోంది.
ఇక అయిదో షేర్‌ కుమిన్స్‌. ఇటీవల బాగా పెరిగిన షేర్లలో ఇదొకటి. ఈ షేర్‌ ఇపుడు రూ. 1435 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ 28 శాతం క్షీణించి రూ. 1030ని తాకుతుందని అంచనా వేస్తోంది జెఫరీస్‌.
టాటా పవర్‌ షేర్‌ కూడా తగ్గుతుందని అంటోంది ఈ బ్రోకరేజీ సంస్థ. ప్రస్తుతం టాటా వపర్‌ షేర్‌ రూ. 224 వద్ద ఉంది. ఈ షేర్‌ కనీసం 20 శాతం క్షీణించి రూ. 180ని తాకుతుందని అంచనా వేసింది.
ఇవన్నీ కూడా జెఫరీస్‌ సంస్థ రీసెర్చికి చెందిన అంశాలు. వీటిలో పెట్టుబడికి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఇప్వెస్టర్లు తమ పర్సనల్‌ ఫైనాన్షియల్ అడ్వయిజర్‌ సలహా తీసుకోండి.