For Money

Business News

మళ్ళీ నష్టాల్లోకి నాస్‌డాక్‌

అమెరికా మార్కెట్లను ఇపుడు మాంద్యం భయం వెంటాడుతోంది. ఒకవైపు అధిక వడ్డీ రేట్లపై చర్చ జరుగుతుండగానే… అనలిస్టులు మాంద్యంపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇవాళ నష్టాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌… కోలుకుని గ్రీన్‌లోకి వచ్చినా…మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. నాస్‌డాక్‌ 0.77 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.3 శాతంతో పాటు డౌజోన్స్‌ కూడా 0.12 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అంతకుమునుపు యూరప్‌ మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో వారాంతపు క్రూడ్‌ నిల్వల డేటా కూడా నెగిటివ్‌గా రావడంతో క్రూడ్‌ ఆయిల ధరల పతనం కొనసాగుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ 78 డాలర్లకు చేరగా, అమెరికా క్రూడ్‌ ధర 73 డాలర్లకు చేరింది. మరోవైపు బులియన్‌ గ్రీన్‌లో ఉన్నా…బంగారం ఇంకా 1800 దిగువనే ట్రేడవుతోంది. వెండి మాత్రం రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్‌ బలహీనపడటమే దీనికి కారణం.