For Money

Business News

చివర్లో అమ్మకాల ఒత్తిడి

టెక్నికల్‌గా మార్కెట్‌ తన మద్దతు స్థాయిలను కాపాడుకుంటున్నా… షేర్లు మాత్రం నష్టాలతో ముగుస్తున్నాయి. ఇవాళ కూడా నిఫ్టి 18550 స్థాయిని కాపాడుకుంది. ఆర్బీఐ పాలసీకి ముందు 18,668 పాయింట్లను తాకిన నిఫ్టి ఆర్బీఐ పాలసీని పట్టించుకోలేదు… కాని యూరో మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలతో ట్రేడవుతుండటంతో… ఇన్వెస్టర్లు చివర్లో అమ్మకాలకు పాల్పడ్డారు. నిఫ్టి 18528ని తాకింది. అంటే 140 పాయింట్లు క్షీణించింది. చివర్లో స్వల్పంగా పెరిగి మద్దతు స్థాయి 18,550పైన అంటే 18,560 వద్ద ముగిసింది. ఆర్బీఐ మళ్ళీ వడ్డీ రేట్లు పెంచడంతో ఆటో, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో ఒత్తిడి కన్పించింది. నిఫ్టిలో 39 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ పాలసీ ఊహించిందే కావడంతో నిఫ్టి బ్యాంక్‌లో పెద్ద మార్పు లేదు. అయితే నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం గ్రీన్‌లో ముగిసింది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ అత్యధికంగా 0.62 శాతం నష్టంతో ముగిసింది. జీడీపీ వృద్ధి రేటును ఇవాళ ఆర్బీఐ తగ్గించడంతో మార్కెట్‌ మున్ముందు ఎలా స్పందిస్తుందో చూడాలి.