For Money

Business News

వ్యాట్‌ తగ్గిస్తున్న రాష్ట్రాలు

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. పెట్రోల్‌ లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేరళ, రాజస్థాన్, ఒడిషా రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్​పై 2.41 రూపాయలు, డీజిల్​పై 1.36 రూపాయలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్​ కూడా పన్నును తగ్గించింది. పెట్రోల్​పై 2.48 రూపాయలు, డీజిల్​పై 1,36 మేర తగ్గించినట్లు ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోట్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఒడిసా ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 2.23, డీజిల్‌పై రూ.1.36 చొప్పున తగ్గించింది. మరి మన తెలుగు రాష్ట్రాలు మాత్రం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు.