For Money

Business News

అపుడు మమ్మల్ని అడిగి పెంచారా?

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం… రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాలని కోరడంపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ ఘాటుగా స్పందించారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల్ని కోరని కేంద్రం ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోందని వ్యాఖ్యానించారు. ” కేంద్ర ప్రభుత్వం ధరల్ని పెంచినప్పుడు రాష్ట్రాల అభిప్రాయాల్ని తీసుకోలేదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది. 2014 తర్వాత లీటర్ పెట్రోల్‌పై రూ.23 (250 %), డీజిల్‌పై రూ.29 (900 %) కేంద్రం పెంచింది. ఆ పెంచిన మొత్తం నుంచి ఇప్పుడు కొంత తగ్గించి… రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోంది . సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా? ” అని త్యాగరాజన్ ట్విట్‌ చేశారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ వాదన వస్తోంది. క్రూడ్‌ ఆయిల్‌ తగ్గినా, రష్యా నుంచి చౌకగా క్రూడ్‌ కొ టున్నా… ఇన్నాళ్ళు ముక్కుపిండి జనం దగ్గర పన్నులు వసూలు చేసిన కేంద్రం… ఇపుడు రాష్ట్రాలపై ఒత్తిడి తేవడంపై పలు రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.