For Money

Business News

రూ. 2,300 పెరిగిన వెండి

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలతో పాటు, డాలర్‌ కూడా పెరగడంతో బులియన్‌ రేట్లు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకుంటుందన్న వార్తలతో వెండి ధరలు భారీగా పెరిగాయి. చైనా మార్కెట్‌ నుంచి భారీ డిమాండ్‌ను ఆశిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు ఇవాళ ఏకంగా ఏడు శాతంపైగా పెరిగాయి. ఇక బంగారం ధరలు కూడా మూడు శాతం వరకు పెరిగాయి. ఇక దేశీయంగా ఫ్యూచర్స మార్కెట్‌లో బులియన్‌ ధరలు భారీగా పెరిగాయి. డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర రూ.2319 పెరిగి రూ. 60648 వద్ద ట్రేడవుతోంది. ఇక డిసెంబర్‌ నెల కాంట్రాక్ట్‌ పది గ్రాముల బంగారం ధర రూ.656 పెరిగి రూ. 50840కి చేరింది. కమాడిటీ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు బాగా పెరిగాయి.