For Money

Business News

దిమ్మతిరిగే ఫలితాలు

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ అద్భుత పనితీరు కనబర్చింది. స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలకు మించి రికార్డు స్థాయ టర్నోవర్‌, లాభం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎస్‌బీఐ నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 73.9 శాతం పెరిగి రూ. 13,264 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్‌ నికర లాభం రూ. 7626 కోట్లు. అలాగే నికర వడ్డీ ఆదాయం కూడా 12.8 శాతం పెరిగి రూ. 31,183 కోట్ల నుంచి రూ. 35,183 కోట్లకు చేరింది. మార్కెట్‌ విశ్లేషకులు ఈ త్రైమాసికంలో రూ. 33,099 కోట్ల నికర వడ్డీ ఆదాయంపై రూ. 9,803 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. ఈ రెండు అంశాల్లోనూ ఎస్‌బీఐ అంచనాలను దాటింది.