For Money

Business News

లాభాల్లో సింగపూర్ నిఫ్టి

శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ నష్టాల నుంచి కోలుకుంది. దాదాపు ఒకశాతం దాకా క్షీణించిన సూచీలు క్లోజింగ్‌ కల్లా నష్టాల నుంచి కోలుకున్నాయి. నాస్‌ డాక్‌ ఒక్కటే 0.3 శాతం నష్టంతో ముగిసింది. ఇవాళ ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్‌ ఆకర్షణీయ లాభాల్లోఉన్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఒక శాతం వరకు లాభంతో ఉంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నష్టాలు అర శాతం ప్రాంతంలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లతో లింక్ ఉన్న జపాన్‌, న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌ వంటి మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. లాభాలు కూడా అర శాతంపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 80 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు మార్కెట్‌ వర్గాలకు ముందే తెలుసు. శుక్రవారం భారీ ర్యాలీ వెనుక కారణం ఇదే. అందుకే ధరలు తగ్గించిన తరవాత ఇవాళ నిఫ్టి కేవలం 80 పాయింట్ల లాభానికే పరిమితమైంది. ఇవాళ స్టీల్‌ షేర్లు ఎలా స్పందిస్తాయో చూడాలి. స్టీల్‌ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం వేయడంపై స్టీల్‌ కంపెనీలు అసంతృప్తితో ఉన్నాయి. మరోవైపు కేంద్రం చర్యల వల్ల దేశీయంగా స్టీల్‌ ధరలు తగ్గి, డిమాండ్‌ పెరుగుతుందా అన్నది చూడాలి.మొత్తానికి ఇవాళ మార్కెట్‌ పాజిటివ్‌గా ప్రారంభం కానుంది.