For Money

Business News

అకస్మాతుగా సుంకాలు వేస్తే ఎలా?

ఎనిమిది రకాల స్టీల్‌ ఉత్పత్తులపై శనివారం కేంద్ర ప్రభుత్వం సుంకాలు వేయడంతో స్టీల్‌ కంపెనీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. స్టీల్‌ ఉత్పత్తులపై కేంద్రం తాజాగా 15 శాతం పన్ను విధించింది. మన దేశంలో డిమాండ్‌ తగ్గడంతో ఎగుమతి మార్కెట్లపై దృష్టి పెట్టి… ఇతర దేశాలకు ఎగుమతికి ఆర్డర్లు తీసుకున్నామని జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ వీఆర్‌ శర్మ రాయిటర్స్‌ వార్తా సంస్థతో అన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో ఇపుడు కంపెనీలు నష్టాలతో ఎగుమతి చేయాల్సి ఉంటుందని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల నుంచి యూరప్‌కు స్టీల్ ఎగుమతులు తగ్గాయి. దీంతో యూరప్‌ కంపెనీలతో భారత కంపెనీలు భారీ డీల్స్‌ కుదుర్చుకున్నాయి. ఇపుడు ప్రభుత్వం 15 సుంకం అకస్మాతుగా విధించడతో భారత స్టీల్‌ కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. కనీసం రెండు లేదా మూడు నెలల గుడువు ఇవ్వాల్సిందని అంటున్నాయి.