For Money

Business News

60,000 దాటిన సెన్సెక్స్‌

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా… ఆల్గో లెవల్స్‌కు అనుగుణం నిఫ్టి 17900పైన ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 60,000 దాటి చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్‌ ప్రస్తుతం 60,277 పాయింట్ల వద్ద…నిఫ్టి 17,934 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టి 111 పాయింట్లు పెరగ్గా, సెన్సెక్స్‌ 386 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టి, మిడ్ క్యాప్‌ నిఫ్టి, నిఫ్టి అన్న ఒకేరకంగా పెరిగాయి. రాత్రి డాలర్‌ భారీగా పెరగడంతో దాని ప్రభావం ఇవాళ ఐటీ కౌంటర్లలో కన్పిస్తోంది. టాప్‌ గెయినర్స్‌లో ఐటీ షేర్లు అధికంగా ఉన్నాయి. సో ఆల్గో ట్రేడింగ్‌ ఫాలో అయ్యే వారి తొలి టార్గెట్‌ టచ్‌ చేసింది నిఫ్టి. నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయి 17925 కాగా, తరవాతి స్థాయి 17,950. నిఫ్టి ఈ రేంజ్‌ దాటే అవకాశాలు తక్కువే. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో షార్ట్‌ చేసే పక్షంలో స్ట్రిక్ట్‌ స్టాప్‌ లాస్‌తో చేయండి. మరోవైపు రియల్ ఎస్టేట్‌ షేర్లలో హవా కొనసాగుతూనే ఉంది. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఇవాళ మరో రెండున్నర శాతం పెరిగింది.