For Money

Business News

ఎంసీఎక్స్‌కు సెబీ షాక్‌

కమాడిటీస్‌ విభాగంలో వీక్లీ ఎక్స్‌పెయిరీ డెరివేటివ్స్‌ ప్రారంభించాలని భావిస్తున్న ఎంసీఎక్స్‌కు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ షాక్‌ ఇచ్చింది. సదరు ప్రతిపాదనను తిరస్కరించింది. వీక్లీ డెరివేటివ్స్‌ కారణంగా బంగారం, వెండి కాంట్రాక్ట్‌లలో సాధారణ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే ప్రమాదముందని సెబీ అంటోంది. అసలు ఎంసీఎక్స్‌లో ట్రేడ్‌ చేస్తున్న సాధారణ ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ డేటాను సమర్పించాల్సిందిగా కమాడిటీ బ్రోకర్లు, ఎక్స్ఛేంజీలకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. వారి నుంచి వచ్చిన డేటాను పరిశీలించిన తరవాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఎంసీఎక్స్‌ అటోంది. సెబీ తాజా నిర్ణయంతో ఎంసీఎక్స్‌ షేర్‌పై ఒత్తిడి వచ్చింది. ఉదయం రూ.10,300 వద్ద ఉన్న ఈ షేర్‌ ఇపుడు రూ. 10,000 వద్ద ట్రేడవుతోంది. వీక్లీ డెరివేటివ్స్‌ లేకున్నా… ఎంసీఎక్స్‌ షేర్‌ మున్ముందు పరుగులు పెడుతుందని అనలిస్టులు అంటున్నారు. బులియన్‌ మార్కెట్‌ సమీప భవిష్యత్తులో బాగుంటుందని వీరి అంచనా.