రూ. 546 కోట్ల ఫైన్!
స్టాక్ మార్కెట్ కోర్సులు నిర్వహిస్తున్న అవధూత్ సాథేపై స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తీవ్ర చర్యలు తీసుకుంది. కోర్సుల కోసం ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన రూ.546 కోట్ల జరిమానా విధించింది. వడ్డీతో కలిపి రూ. 601 కోట్ల 37 లక్షలు చెల్లించాలని సెబీ ఆదేశించింది. స్టాక్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఇక నుంచి ఎలాంటి కోర్సులు నిర్వహించరాదని ఆదేవించింది. కోర్సులకు సంబంధించి సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ఉంచిన మెటీరియల్ వీడియోలను తొలగించాలని ఆదేశించింది. అయితే తాము స్టాక్ మార్కెట్ టిప్స్‌ను ఇన్వెస్టర్లకు అందించడం లేదని, కేవలం సలహాలు మాత్రమే ఇస్తున్నామని అవధూత్ సాథే అంటున్నారు.
