For Money

Business News

ఫ్యూచర్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్

కిషోర్‌ బియాని ఆధ్వర్యంలోని ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ లెక్కల ఖాతాల విషయంలో స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది.ఆర్థిక విషయాలకు సంబంధించి కంపెనీ ఏమైనా అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించింది. ఇందుకోసం మెస్సర్స్‌ చోక్సీ అండ్‌ చోక్సీ ఆడిట్‌ సంస్థను నియమించింది. ఆర్థిక వివరాలు, లావాదావీల వెల్లడిలో ఫ్యూచర్‌ రిటైల్‌ నిబంధనలు పాటించడం లేదనే అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ తెలిపింది.