For Money

Business News

స్థిరంగా వాల్‌స్ట్రీట్‌… క్రూడ్‌ డౌన్‌

అమెరికా మార్కెట్లు ఓపెనింగ్ నష్టాల నుంచి బయట పడ్డాయి. మూడు ప్రధాన సూచీలు స్థిరంగా ఉన్నాయి. పెద్ద లాభనష్టాలు లేవు. దాదాపు క్రితం వద్దే ఉన్నాయి. డాలర్‌ ఇవాళ ఏకంగా 0.61 శాతం క్షీణించింది. డాలర్‌ ఇండెక్స్‌ 106 దిగువకు వచ్చేసింది. ఇదే సమయంలో క్రూడ్‌ ఆయిల్‌ భారీగా క్షీణించింది. గత వారం 104 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్‌ ఇవాళ 93.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళే మూడు శాతంపైగా క్షీణించింది. డాలర్‌ పతనం బులియన్‌ మార్కెట్‌కు బాగా కలిసి వచ్చింది. మరోవైపు యూరో మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో ముగిశాయి. యూరోస్టాక్స్‌ 0.56శాతం లాభంతో ముగిసింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఇవాళ వడ్డీ రేట్లను అర శాతం పెంచింది.దీంతో వడ్డీ రేట్లు 1.75 శాతానికి చేరింది. 2008 తరవాత వడ్డీ రేట్లు ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి.