For Money

Business News

రూ. 52000 దాటిన పసిడి

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీన పడటంతో.. దిగువస్థాయిలో టెక్నికల్‌గా మద్దతు అందడంతో పది గ్రాముల బంగారం ధర ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో రూ. 52000 దాటింది. గత నెలలో ఔన్స్‌ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లలో 1700 డాలర్ల దిగువకు చేరింది. దిగువ స్థాయిలో టెక్నికల్‌ మద్దతు లభించడంతో పాటు డాలర్‌ బలహీనపడటంతో బంగారం, వెండి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌ అక్టోబర్‌ నెల బంగారం కాంట్రాక్ట్‌ రూ.52120 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే బంగారం రూ. 731 పెరిగింది. అయితే వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి అక్టోబర్‌ కాంట్రాక్ట్‌రూ.369 పెరిగి రూ. 67922కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం విలువ భారీగా పెరిగినా… మన వద్ద తక్కువే పెరిగిందనాలి. ఎందుకంటే డాలర్‌తో రూపాయి విలువ బలపడింది.