For Money

Business News

వజీరెక్స్‌ ఎక్స్ఛేంజీ: వంద కోట్లు జప్తు

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు చేస్తున్నది. లోన్‌యాప్స్‌ కేసులో వజీర్‌ ఎక్స్‌ (wazirx) క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లో మొన్నటి నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ డైరక్టర్ల ఇండ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. 100 కోట్లు జప్తు చేసినట్లు తెలుస్తోంది. రూ.2790 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు సంబంధించి వజీర్‌ ఎక్స్‌ సంస్థకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీచేసింది. సంస్థ డైరెక్టర్లు నిశ్చల్‌ శెట్టి, సమీర్‌ హనుమాన్‌కు తాఖీదులు పంపించింది. బిట్‌కాయిన్‌, ట్రాన్‌, లిట్‌కాయిన్‌, రిప్పల్‌ వంటి డిజిటల్‌ కరెన్సీల రూపంలో లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. రూపాయల్లో ఉన్న సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చి కేబాన్‌ దీవుల్లో రిజస్టరయిన బినాన్స్‌ వ్యాలెట్లలోకి పంపినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.