బేస్ వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ
ఈనెల 15 నుంచి అంటే రేపటి నుంచి బేస్ రేటును 0.05 శాతం తగ్గించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. అలాగే కనీస రుణ వడ్డీ రేటును కూడా 0.05 శాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 12.20 శాతానికి చేరింది. ఇంటి రుణాలపై గత ఏప్రిల్‌లో ఎస్‌బీఐ వడ్డీ రేట్లను 6.7 శాతానికి తగ్గించింది. మహిళల పేరుతో తీసుకునే ఈ రుణాలపై వడ్డీరేటు మరో 0.05 శాతం తగ్గించింది. బేస్ రేటును ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఇది కనీస వడ్డీ రేటు. దీన్ని అన్ని బ్యాంకులు కచ్చితంగా పాటించాలి. దీనిపై ఎంతకైనా వడ్డీ వసూలు చేసుకోవచ్చు. ఆర్‌బీఐ బేస్ రేటును నిర్ణయించిన తరవాత అంతకన్నా తక్కువకు ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వడానికి వీలు లేదు. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయించిన బేస్ రేటు 7.30 శాతం నుంచి 8.80 శాతం మధ్య ఉండాలి.