For Money

Business News

2021 ఐఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజీ 1టీబీ!

మరికాస్సేపట్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. ఇవాళ కాలిఫోర్నియాలో జరిగే యాపిల్‌ ఈవెంట్‌ ఐఫోన్ 13ను మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఈ మోడల్‌కు సంబంధించి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 మిని ఫోన్లు అంటే నాన్‌ ప్రొ మోడల్స్‌ 128జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజీతో వస్తున్నాయి. ఐఫోన్‌ 13 ప్రొ, ఐఫోన్‌ 13 ప్రొ మోడల్స్‌ నాలుగు స్టోరేజీ ఆప్షన్స్‌తో వస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐఫోన్‌ 13 ప్రొ మోడల్స్‌ కూడా 128జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజీతో వస్తున్నాయి. 2021 ఐఫోన్‌ ప్రొ మోడల్‌ 1 టీబీ స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే చరిత్రలో 1టీబీ ఇంటర్నల్‌ మెమొరీతో వస్తున్న తొలి ఐఫోన్‌ ఇదే అవుతుంది.