For Money

Business News

రష్యా ఆయిల్‌ లేదు… భారత్‌కు నిరాశ

భారీ డిస్కౌంట్‌కు క్రూడ్‌ ఆయిల్‌ సరఫరా ఇస్తామని ప్రకటించిన రష్యా ఇపుడు మాట మార్చింది. తన వద్ద సరిపడా నిల్వలు లేనందున రెండు భారత కంపెనీలకు క్రూడ్‌ అమ్మడం లేదని పేర్కొంది. రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌ కొనేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌తో పాటు హిందుస్థాన్‌ పెట్రోలియం చర్చలు జరిపారు. భారీ డిస్కౌంట్‌తో ఆయిల్ ఇస్తామని రష్యా పేర్కొనడంతో … రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ రాస్‌నాఫ్ట్‌తో ఈ మూడు భారత కంపెనీలు చర్చలు ప్రారంభిచాయి. ఆరు నెలల కాంట్రాక్ట్‌ కోసం రెడీ అయ్యాయి. వీటిలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మాత్రమే రాస్‌నాఫ్ట్‌తో ఒప్పందం చేసుకుంది. ఆరు నెలల ఒప్పందంలో భాగంగా ప్రతినెలో రష్యా నుంచి 60 లక్షల బ్యారెళ్ళ చమురు కొనేందుకు ఒప్పందం కుదిరింది. ఇరు పక్షాల అంగీకారంతో ఈ ఒప్పందాన్ని అదనంగా మరో 30 లక్షల బ్యారెళ్ళ ఆయిల్ కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే మిగిలిన రెండు ఆయిల్‌ కంపెనీలతో రాస్‌నాఫ్ట్‌ ఒప్పందం చేసుకోలేదు. తమ వద్ద నిల్వలు లేవని రాస్‌నాఫ్ట్‌ అంటోంది. మరింత ఆయిల్‌ కొనేందుకు భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.