For Money

Business News

రూపాయి పతనం ఆపతరమా?

గుజరాత్‌ ముఖ్యంత్రిగా ఉన్న సమయంలో మోడీ… యూపీఏ ప్రభుత్వం తెగ కామెంట్లు చేశారు రూపాయి పతనంపై. కాని మోడీ హయాంలో రూపాయి పతనం ఆపడం ఎవరితరం కావడం లేదు. గత వారం రూపాయిని కాపాడేందుకు భారీ ఎత్తున డాలర్లు అమ్మింది ఆర్బీఐ. కాని నెలాఖరులతో స్టాక్‌ మార్కెట్‌ అమ్మకాలతో పాటు క్రూడ్‌ బిల్లులు చెల్లింపు ఉండటంతో డాలర్‌కు ఎక్కడి లేని డిమాండ్ వచ్చింది. దీంతో ఆర్బీఐ మార్కెట్‌కు దూరంగా ఉండటంతో ఇవాళ ఇంట్రా డేలో డాలర్‌తో రూపాయి విలువ 78.78కి పడిపోయింది. సాయంత్రం 5 గంటలకు ఫారెక్స్‌ మార్కెట్‌ ముగుస్తుంది. మరి అపుడు ఏ స్థాయిలో క్లోజ్‌ అవుతుందో చూడాలి. ఈక్విటీ మార్కెట్లలో భారీ ఎత్తున అమ్మకాలు చేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు… మార్కెట్‌ పెరిగినపుడు అమ్మకాల ఉధృతం చేస్తున్నారు. దీంతో డాలర్‌ డిమాండ్‌ పెరుగుతోంది. ఒకే రోజు రూపాయి 41 పైసలు పతనం కావడం ఇటీవల జరగలేదు. ఫార్వర్డ్‌ మార్కెట్‌లో జులై నెల డెలివరీకి ఉద్దేశించిన కాంట్రాక్ట్‌ 78.97కు చేరింది.