For Money

Business News

రిలయన్స్‌ జియో ఛైర్మన్‌గా ఆకాశ్‌

రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ చేతికి రిలయన్స్ జియో పగ్గాలు అందాయి. ఈ కంపెనీ డైరెక్టర్‌గా ముకేశ్‌ అంబానీ నిన్న రాజీనామా చేశారు. ఇవాళ రిలయన్స్‌ జియో ఛైర్మన్‌గా ఆకాశ్‌ అంబానీ నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పనిచేశారు. కంపెనీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్‌ మోహన్‌ పవార్‌ నియమితులయ్యారు. రామిందర్‌ సింగ్‌ గుజ్రాల్‌, కేవీ చౌదరిలు కంపెనీలో అదనపు డైరెక్టర్లుగా చేరారు. వీరు స్వతంత్ర డైరెక్టర్లు వ్యవహరిస్తారు. జూన్‌ 27వ తేదీ నుంచి అయిదేళ్ళపాటు వీరు ఈ పదవిలో కొనసాగుతారు.