For Money

Business News

టీ హ‌బ్ -2 ప్రారంభం

టీ హ‌బ్-2ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్‌ హబ్‌ ఇది. ప్రారంభం తరవాత టీ హ‌బ్-2 ప్రాంగ‌ణమంతా ఆయన క‌లియ తిరిగారు. టీ హ‌బ్ ఫెసిలిటీ సెంట‌ర్ ప్రత్యేక‌త‌ల‌ను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. కేసీఆర్ వెంట ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు ప‌లువురు మంత్రుల, ఉన్నతాధికారులు ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్‌-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సుమారు రూ.276 కోట్లతో అత్యాధునిక డిజైన్‌తో దీన్ని నిర్మించారు. టీ హబ్‌ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు. మూడు ఎకరాల్లో పది అంతస్తుల్లో ఈ హబ్‌ను నిర్మించారు. 3.6 లక్షల చదరుపు అడుగుల్లో విస్తరించిన ఈ హచ్‌లో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.