For Money

Business News

పతనంలో రూపాయి కొత్త రికార్డు

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి పతనం జెట్‌ స్పీడుతో సాగుతోంది. రోజుకో ఆల్‌ టైమ్‌ కనిష్ఠ స్థాయి నమోదు చేస్తోంది. ఇవాళ ఏకంగా 46 పైసలు క్షీణించడంతో డాలర్‌కు రూపాయి విలువ 78.83కు పడిపోయింది. మోడీ అధికారంలోకి వచ్చినపుడు 59.44 రూపాయలు చెల్లిస్తే ఒక డాలర్‌ వచ్చేది. ఇపుడు 78.83 రూపాయిలు ఇస్తే ఒక డాలర్‌ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరగడంతో పాటు మన ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు ప్రతిరోజూ షేర్లను అమ్ముతుండటంతో డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఇవాళ ప్రారంభంలో డాలర్‌తో రూపాయి విలువ 78.53గా ఉండేది. తరవాత 78.85కు క్షీణించింది. క్లోజింగ్‌లో రెండు పైసలు పెరిగి 78.83 వద్ద ముగిసింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నందున మన రూపాయి 79.50 దాకా పడే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు.