For Money

Business News

లాభాల్లో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నిఫ్టి గ్రీన్‌లో ముగిసింది. ఎల్లుండి నెలవారీ, వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉండటంతో ఇప్పటి నుంచి ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పొజిషనింగ్‌ మారుతోంది. గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరిగిన షేర్లలో కరెక్షన్‌ కన్పిస్తోంది. ఇవాళ ఉదయం 15710 పాయింట్లకు పడిన నిఫ్టికి దిగువస్థాయిలో మద్దతు లభించింది. మిడ్‌ సెషన్‌ తరవాత యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లోకి రావడంతో మన మార్కెట్‌ కూడా కోలుకుంది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి 15850 వద్ద ముగిసింది. దిగువ స్థాయి నుంచి 140 పాయింట్లు కోలుకున్నా.. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి లాభం 18 పాయింట్లు మాత్రమే. నిఫ్టిలో 32 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 109 డాలర్ల నుంచి 113 డాలర్లకు పెరగడంతో దేశీయ మార్కెట్‌లో ఓఎన్‌జీసీ వరుసగా రెండో రోజు టాప్‌ గెయినర్‌గా ముగిసింది. కొన్ని మెటల్స్‌, కొన్ని ఆటో, కొన్ని ఐటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇదే కారణంగా ఏషియన్‌ పెయింట్స్‌ క్షీణించింది. టైటాన్‌ టాప్‌ లూజర్‌ కాగా… ఇటీవల భారీగా పెరిగిన దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ దాదాపు రెండు శాతం క్షీణించింది. అలాగే బజాజ్‌ ట్విన్స్ కూడా.