For Money

Business News

బక్క చిక్కిన రూపాయి

ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ప్రపంచ కరెన్సీ మార్కెట్లన్నీ స్పందించాయి. రష్యా రూబుల్‌ భారీగా క్షీణించింది. యుద్ధం తరవాత అమెరికా డాలర్‌, అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. దీంతో డాలర్‌కు ప్రతిగా అనేక దేశాలు కరెన్సీలు క్షీణించాయి. నిన్న ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజ్‌ (ఫారెక్స్‌) మార్కెట్లో అమెరికా డాలరుతో రూపాయి మారకపు విలువ గత పది నెలల్లో ఎన్నడూ లేనివిధంగా 1.5 శాతం క్షీణించింది. దీంతో డాలర్‌తో రూపాయి విలువ 74.56 నుంచి 75.65కు పడిపోయింది. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడ్‌ ధరలు కూడా భారీగా పెరగడంతో డాలర్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, క్రూడ్‌ ధరలు, స్టాక్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఫలితంగా డాలర్ డిమాండ్‌ బాగా పెరిగి… రూపాయి బలహీనపడింది.