For Money

Business News

ఓలా ఎలక్ట్రిక్‌ మరో భారీ ప్లాంట్

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతుంది. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ అండ ఉన్న ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాన్ని 50 గిగావాట్(జీడబ్ల్యుహెచ్) సామర్థ్యంతో నిర్మించాలని యోచిస్తోంది. కోటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయడానికి ఓలాకు 40 జీడబ్ల్యుహెచ్ బ్యాటరీ సామర్థ్యం అవసరం. అలాగే, మిగతా 10 జీడబ్ల్యుహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం వినియోగించుకోవాలని భావిస్తుంది. 2023 నాటికి 1 జీడబ్ల్యుహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి, రాబోయే 3-4 సంవత్సరాల్లో 20 జీడబ్ల్యుహెచ్’కు విస్తరించాలని చూస్తున్నట్లు సమాచారం.
ఓలాకు ఇపుడు చెన్నైలో ప్లాంట్‌లో రోజుకు 1,000 స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది.