For Money

Business News

ఆస్తుల పంపకం అయిపోయినట్లేనా!

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను నిర్ణయించేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూచాయగా వార్తలు రాగా… ఇవాళ జరిగిన ఏజీఏంలో ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ను ఆకాష్‌ అంబానీకి ఎపుడు డిక్లేర్‌ చేశారు. ఆ విభాగానికి ఆకాష్‌ను ఛైర్మన్‌గా నియమించారు. ఇవాళ జరిగిన సమావేశంలో రిలయన్స్‌ రీటైల్‌ను కుమార్తె ఇషాకు ఇస్తున్నట్లు ఆయన ఇవాళ తెలిపారు. ఇషా ప్రముఖ పారిశ్రామికవేత్త అజయ్‌ పిరమల్‌ కోడలు అయిన విషయం తెలిసిందే. ఆకాష్‌, ఇషా కవలలు. చివ్న కుమారుడు అనంత్‌ అంబానీకి న్యూ ఎనర్జీ వ్యాపారాలను అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఇటీవల భారీ ఎత్తున ఈ రంగంలోకి రిలయన్స్‌ విస్తరించిన విషయం తెలిసిందే. రిలయన్స్‌ రీటైల్‌ వెంచర్స్‌కు ముకేష్‌ అంబానీనే అధినేతగా ఉంటారు కాని.. నిర్వహణ మొత్తం ఇషాదే. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ముకేశ్‌ అంబానీనే ఛైర్మన్‌గా ఉంటారు. నీతా అంబానీ కంపెనీ బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతారు.