For Money

Business News

దుమ్ము రేపుతున్న రియాల్టి షేర్లు

ఈ ఏడాది ఆరంభం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన రియాల్టి షేర్లు ఇటీవల జోరందుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఈ సూచీ 57 శాతం పెరిగింది. కేవలం గత మూడు సెషన్స్‌లో రియాల్టి ఇండెక్స్‌ 22 శాతం పెరగడం విశేషం. ముఖ్యంగా చైనాలో రియల్ ఎస్టేట్‌ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్న వార్తలతో మన మార్కెట్‌లో అదే రంగానికి చెందిన షేర్లకు డిమాండ్ ఏర్పడింది. ఎవర్‌గ్రాండే కంపెనీ వ్యవహారంతో చైనాలో రియల్‌ ఎస్టేట్‌ షేర్లు భారీగా క్షీణించిన విషయం తెలిసిందే. ఆగస్టు 25వ తేదీన రూ. 1425 ప్రాంతంలో ఉన్న గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేర్‌ ఇవాళ రూ.2199 వద్ద ముగిసింది. కేవలం మూడు రోజుల్లో భారీగా లాభపడింది. ఈనెల 21న కూడా ఈ షేర్ రూ.1,622 ప్రాంతంలో ఉండేది. ఇవాళ రూ. 2,199కి చేరింది. ఇక ఒబెరాయ్‌ రియాల్టి, డీఎల్‌ఎఫ్‌, శోభా డెవలపర్స్‌, హెమిస్పియర్‌ ప్రాపర్టీస్‌ షేర్లు కూడా బాగా పెరిగాయి.