For Money

Business News

రాష్ట్రాలకు నిధుల సమీకరణ భారం

ద్రవ్యోల్బణం ఇప్పటి వరకు 4.5 శాతం ఉంటుందని అంచనా వేసిన ఎస్‌బీఐ… ఇపుడు అంచనాను 5.7 శాతానికి పెంచింది. ఆర్బీఐ గవర్నర్‌  శక్తికాంత దాస్‌ ఇవాళ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ రెపో రేటును మార్చడం లేదన్నారు. ఆర్‌బీఐ ప్రకటన తరవాత పదేళ్ళ ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్‌ (ప్రతిఫలం) 7 శాతాన్ని దాటింది. 2019 తరవాత బాండ్‌ ఈల్డ్‌ 7.007 శాతానికి చేరడం ఇదే మొదటిసారి. అంటే నిధుల సమీకరణ కోసం రాష్ట్రాల బహిరంగ మార్కెట్‌ను ఆశ్రయిస్తే మరింత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది.